నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎస్పీ సిద్ధార్ధ కౌశల్
150 రోజుల్లో పోలీస్ స్టేషన్ నూతన భవనం పూర్తి చేయాలి
(పెన్‌పవర్, మర్రిపూడి)
మర్రిపూడి మండంలలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ నిర్వహించారు. బుధవారం స్థానిక ఎస్‌ఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో చేపట్టిన భూమి పూజ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నూతన భవన నిర్మాణానికి నేడు బీజం పడిందన్నారు. నూతన పోలీస్ స్టేషన్‌ను 150 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. మండంలలోని నాయకులందరూ ముందుకు వచ్చి నూతన పోలీస్ స్టేషన్ భవనానికి నిధులు సమకూర్చి ఇస్తున్నందుకు అందరికీ అభినందనలు తెలిపారు. 1984 సంవత్సరం నుండి పోలీస్ స్టేషన్ అద్దె భవనంలో పనిచేస్తుందన్నారు. ఎంతో సంతోషకరమైన విషయం ఏమిటంటే ఎస్‌ఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతున్నందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానన్నారు. అందరూ మంచి మనస్సుతో ఏంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికి అభినందనలు తెలియజేశారు. దీంతో పాటు కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా బీసీ నాయకుడు మాచేపల్లి నాగయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ 150 రోజుల్లో పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పూర్తి చేయాలని అన్నారు. కానీ మనమందరం కలిసి 120 రోజుల్లోనే పూర్తి చేసి ఇవ్వాలని సభాముకంగా తెలియపరుస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ ప్రకాశరావు, పొదిలి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వి శ్రీరామ్, దొనకొండ ఎస్‌ఐ ఫణిభూషణ్, కొనకనమిట్ల ఎస్‌ఐ వెంకటేశ్వర్లు నాయక్, మర్రిపూడి ఎస్‌ఐ సుబ్బరాజు, పొదిలి ఎస్‌ఐ సురేష్, పోలీస్ సిబ్బంది, డిప్యూటీ తహశీల్దార్ రవిశంకర్, ఎఓ తిరుమరావు, మండల కన్వీనర్ బొదా రమణరెడ్డి, మాచేపల్లి నాగయ్య, ఇనుకొల్లు సుబ్బారెడ్డి, బోగసముద్రం విజయ భాస్కర్ రెడ్డి, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment