Followers

ప్రభుత్వ భూములను పరిశీలించిన ఆర్డీవో లక్ష్మీప్రసన్న...

 


ప్రభుత్వ భూములను పరిశీలించిన ఆర్డీవో లక్ష్మీప్రసన్న...


అవసరమైతే కొనుగోలు చేయండి ఆర్డిఓ



పోలవరం పెన్ పవర్


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఆగస్టు 15 వరకు వాయిదా పడటంతో పూర్తిస్థాయిలో లేఅవుట్లు సిద్ధం కానీ   పోలవరం మండలం గూటాల గ్రామంలో  నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూములను జంగారెడ్డిగూడెం ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న శుక్రవారం పరిశీలించారు. గుటాల పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాలు అర్హులైన 163 మంది లబ్ధిదారులకు గాను గూటాల గ్రామం కోండ్రు వీధి పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన లే అవుట్ లలో 68  మంది లబ్ధిదారులకు మాత్రమే రావడంతో మిగతా  95 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న  గుటాల ,కొత్త పట్టిసీమ గ్రామాలలో ఉన్న డి ఫామ్ పట్టా భూములు, పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములను పరిశీలించారు. కొండ ప్రాంతంలో గల భూములు, చెరువు భూములు ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించవచ్చని ప్రజలకు అనువుగా ఉండే భూములు ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరమైన రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి అయినా లేఅవుట్లు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేసే నాటికి పూర్తి స్థాయిలో లేఅవుట్లు పూర్తి చేయాలని ఆర్ డి ఓ అన్నారు. ఆర్డీవో వెంట పోలవరం ఎమ్మార్వో ఎండి నజీముల్లా షా , ఆర్ఐ కాజా రమేష్, వీఆర్వో ప్రసాద్, స్సర్వేరియర్ హరికృష్ణ, సుంకర అంజిబాబు, సుంకర కొండబాబు, డి హరి రామ కృష్ణ, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...