సర్వేజన చారిటబుల్ ట్రస్ట్ వారు ఏఎన్ఎంలకు థర్మల్ స్క్రీనింగ్ మిషన్లు పంపిణీ
గండేపల్లి,పెన్ పవర్
గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో గల సర్వజన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శనివారం మల్లేపల్లి పంచాయతీ సెక్రెటరీ చేతుల మీదుగా ఏఎన్ఎం లకు థర్మల్ స్క్రీనింగ్ మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లాజర్ మాట్లాడుతూ ఈ థర్మల్ స్క్రీనింగ్ కిట్ ను ఉపయోగించడం వల్ల జ్వరం లక్షణాలను తెలుసుకోవచ్చన్నారు. గ్రామాలలో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సర్వేజన ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరొనా మహమ్మారి పై ప్రజలంతా జాగ్రత్తలు వహించాలన్నారు. దీని పట్ల గ్రామాలలో ఏఎన్ఎంలు చేస్తున్న కృషి మరువలేనిది అన్నారు. ప్రజలంతా ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటూ,మాస్క్ లను ధరించాలని,శానిటైజర్ లను వాడాలని సూచించారు. అంతేకాకుండా వీలైనంతవరకు రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళ రాదన్నారు. సామాజిక దూరం పాటించడం ద్వారా కరొనా నియంత్రించవచ్చని. ప్రతి ఒక్కరూ పోలీసు, వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఏఎన్ఎంలకు థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, మాస్కులును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్ లు,సర్వేజన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment