ప్రభుత్వం పనితీరు పెంచడం పంచడం తప్ప అభివృద్ధి శూన్యం
గోనెగండ్ల, పెన్ పవర్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు పెంచడం పంచడం తప్ప అభివృద్ధి శూన్యం అని టీడీపీ విద్యార్థి సంఘం(టీఎన్ఎస్ఎఫ్)మండల అధ్యక్షులు రంగస్వామినాయుడు అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బివి ఆదేశాల మేరకు పత్రికా సమావేశం చేయడం జరిగిందన్నారు.ఈ ప్రభుత్వ పనితీరు ప్రజల దగ్గర వివిధ రూపాల్లో బాదుడే బాదుడుగా డబ్బులు వసూలు చేస్తూ వారికే పంచిపెట్టడం గొప్ప కార్యంగా పెట్టుకుందని ఆరోపించారు.దేశంలో ఎక్కడా లేనంతగా వ్యాట్ వసూలు చేయడం భావ్యం కాదన్నారు.నేడు ఈ కోవలోకి పెట్రోల్ పై రూ.1.24,డీజిల్ పై 93 పైసలు వ్యాట్ పెంచడం కాక పెట్రోల్ పై 31 శాతం పన్నుతో పాటు అదనంగా 4 రూపాయలు.డీజిల్ పై 22.25 శాతంతో వ్యాట్ తో పాటు అదనంగా రూ.4 సుంకాన్నీ పెంచడం సిగ్గుచేటని అన్నారు.పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు వ్యాట్ పెంచిందంటే నేడు ఈ రాష్ట్రంలో ఏ పాలన కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.నాడు ప్రతిపక్షంలో గొప్పలు చెప్పి నేడు అధికారంలోకి వచ్చాక శ్రీరంగా నీతులు వళ్ళుతున్నారని ప్రమాణ స్వీకారం రోజునే విద్యుత్ చార్జీలు ఇతర చార్జీలు పూర్తిగా తగ్గించేస్తాం అని చెప్పి మాట తప్పడం మడమ తిప్పడం ఈ ప్రభుత్వ పెద్దమనిషికి చెల్లిందన్నారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 వ్యాట్ తగ్గిస్తే మీరూ పెంచుకుంటూ పోవడం ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో ప్రజల దగ్గర రెండింతలు పిండుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు.ఈ కరోనా సమయంలో ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీలు,బస్ చార్జీలు పెంచి సామాన్యుల నడ్డివిరిచిందని అన్నారు.రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని దౌర్జన్యంగా పేదల గుడిసెలు తొలగించడం,అధికారులతో దౌర్జన్యాలు,హత్యలు,దోపిడీలు, అత్యాచారాలు,దళితులపై దాడులు తప్ప ఏమి సాంధించారని ప్రశ్నించారు.కక్ష్య సాధింపు లో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతల అక్రమ అరెస్టులు,బెదిరింపులు తప్ప ఈ ప్రభుత్వం వెలగబెట్టింది ఏంది లేదన్నారు.సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే డబ్బులు,గుట్కాలతో పట్టుపడుతున్నా వారికి ప్రభుత్వం కొమ్ముకాయడం సిగ్గుచేటని అన్నారు.ఇకపోతే గోనెగండ్లలో ఎల్ఎల్సీ కాలువ రహదారిలో భారీ అక్రమాలు అవినీతి చోటుచేసుకుందని అవి తప్పకుండా బయటకు తిస్తామని అన్నారు.
No comments:
Post a Comment