డాక్టర్ లేక రోగులు సతమతం
అనకాపల్లి, పెన్ పవర్
పట్టణంలో విజయరామరాజుపేట వద్దనున్న ఎఎం సి కాలనీ లో ఆరోగ్యశ్రీ హెల్త్ వెల్ నెస్ పేరిట ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో వైద్యులు లేక రోగులు సతమతమవుతున్నారు అని ఆమ్ ఆద్మీ నాయకులు కొణతాల హరనాథ్ బాబు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎనిమిదేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో ఉన్న డాక్టర్ను కరోనా సేవల కోసం వేరే చోటికి పంపించారన్నారు. కానీ అక్కడ మరో డాక్టర్ను నియమించికపోవడంతో రోగులు వందల్లో రోజు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. ఆర్డిఓ అధికారులకు వినతి పత్రం అందజేసిన ఈ కార్యక్రమంలో మా వూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment