పేదల నివాసానికి అనుకూలంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి: గొల్లపల్లి
రాజోలు, :పెన్ పవర్
రాజోలు మండల రెవెన్యూ తహసీల్దార్ కి మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు పేదలకు నివాసానికి అనుకూలంగా ఉండేలా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు .ఈ సందర్బంగా గొల్లపల్లి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి అని నిర్ణయించింది, కానీ ఈ కార్యక్రమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.గతంలో ఇచ్చిన ఇండ్ల పట్టాలు రద్దు చేసి కొత్తవారికి ఇవ్వటం చాలా దారుణం అని, ప్రజా వాసాలకు దూరంగా నివాసానికి అనువుగా లేని చోట్ల మరియుస్మశానాలకు దగ్గరలోను,గోదావరి వరద ముంపునకు గురి అయ్యే ప్రాంతాలలో ను ఇండ్ల స్థలాలు ఇవ్వడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదని గొల్లపల్లి అన్నారు, ప్రజలకు ఇచ్చే స్థలాలు కప్పుదల చేసే మట్టి ని కొన్ని చోట్ల స్మశానంలలో ఎముకల తో కూడిన మట్టిని, పంట కాలవలోను, డ్రైనేజీలలోను గుడ్డముక్కలు, చెత్త చెదారం తో కూడిన వండ్రి మట్టితోను, పూడ్చడం జరిగింది, మానవజీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కల అంటువంటి స్థలం ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం గా వ్యవహరించడం చాలా దారుణం అని గొల్లపల్లి అన్నారు, ఇండ్ల స్థలాల కొనుగోలులో కూడ రాజకీయ దళారుల ప్రమేయం తో తక్కువ రేటు భూములను చాలా ఎక్కువ రేటుకు కొంటూ వివిధ పన్నుల రూపాలలో ప్రభుత్వానికి కట్టిన ప్రజల సొమ్మును దోచుకు తినే పనిలో ఉన్నరారని ఆయన అన్నారు. ఇటువంటి కార్యక్రమం అవినీతి లో కూరుకుపోవడం బాధగా ఉందని గొల్లపల్లి ఆవేదన వ్యక్తపరిచారు.నేను తెలియజేసిన అన్నీ విషయాల మీద విచారణ చెయ్యాలని, పేదలకు నివాసానికి అనువైన ఇండ్ల స్థలాలు ఇవ్వాలని , మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాను అని గొల్లపల్లి అన్నారు. ఈ కార్యక్రమం మండల టీడీపీ సెక్రటరీ చాగంటి స్వామి, మట్టపర్తి లక్ష్మి, బేతినీడి శ్రీనివాస్, కోళ్ల వెంకన్న, కట్టా సూరిబాబు, నార్కేడమిల్లి కనకం,రావి మురళికృష్ణ, పామర్తి రమణ, అడబాల విజయ్ , చెల్లింగి శ్రీనివాస్,కడలి వెంకటేశ్వరావు, పెట్టాను సూరిబాబు, చెల్లుబోయిన శ్రీనివాస్, కసుకుర్తి త్రినాధస్వామి, రాయుడు రామశంకర్, బోళ్ల వెంకటరమణ, కడలి వెంకటరమణ , దాడి కృష్ణ, నార్కేడమిల్లి విష్ణు, కుసుమ ప్రసాద్, కత్తి రాజు, కడలి నాగేశ్వరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు...
No comments:
Post a Comment