మైదాన ప్రాంత గిరిజనులు సాగులో ఉన్న
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
గిరిజన సంఘం ఆద్వర్యంలో ఆందోళన
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
మైదాన ప్రాంత గిరిజనులు సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రజాసంఘాలు అద్వర్యంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో మంగళవారం చీడికాడ మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట , ఆందోళన చేసారు అనంతరం గిరిజన సంఘం నాన్షేడ్యూల్డ్ ఏరియా జిల్లా కార్యదర్శి ఇ ,నరసింహమూర్తి సిఐటియు మండల కార్యదర్శి రొంగలిదేముడునాయుడు వ్వవసాయకార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న మాట్లాడుతూ తరతరాలుగా గిరిజనులు అటవీ భూముల్లో జిడిమామిడి తోటలు వెసుకోని దాని ద్వారా వచ్చే ఆదాయం తో ఉపాది పోందుతున్నారన్నరు. విటికి పట్టాలు ఇవ్వాలని ఇప్పటికే సంభందిచిన అదికారులు ధరఖాస్తులు పెట్టు కోవటం తో అధికారులు సంభందించిన జాబితా లు తయారు చేయడం జరిగిందని తెలిపారు. అయితే పారెస్టు ఆధికారులు మాత్రం గిరిజనులు పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిపారు. గిరిజనులు సాగులో ఉన్నది అటవీ రెవెన్యూ భూమిలుగా ఆధికారులు తెల్చ వలసి ఉందన్నారు. గస్టు తొమ్మిదో తేదీన ఆదివాసుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ 11 మండలాల్లో 21.144 ఎకరాల్లో 13.172 మంది ఆదివాసులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం ఫారెస్ట్ భూములు సాగు చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని
వీరితోపాటు నాన్ షెడ్యూల్ ఏరియా మండలాలు అయిన దేవరాపల్లి చీడికాడ వి ,మాడుగుల రావికమతం రోలుగుంట గోలుగోండ నాతవరం కోటవురట్ల మండలాల్లో వేలాది ఎకరాల్లో అటవీ భూములు సాగు చేస్తున్నట్లు 112 గ్రామాల కుచెందిన ధరఖాస్తులు పెట్టుకోవడం జరిగిందని అన్నారు వీటిని అయా మండలాలుకు చెందిన తహశీల్దార్లు సాగు దార్లును గుర్తించడం జరిగిందని గతంలో అటవీ భూములపట్టాలు పంపిణీ షేడ్యూల్డ్ ఏరియా కు పరిమితం చేస్తె నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో ని గిరిజనులు నష్ట పోవడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే నాన్ షేడ్యూల్డ్ ఏరియా లోని గిరిజనులు ను షేడ్యూల్డ్ ఏరియాలో ని చేర్చకపోవటం వలన 1/70 లాంటి భు బదాలయింపు చట్టం వర్థించక పోవడం వలన గిరిజనులు భూములు అన్యా క్రాంతం అవ్వడం జరిగిందని ప్రస్తుతం నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో ని గిరిజనులు అందరూ అటవీ భూములు పై ఆధారపడి జీవిస్తున్నారని ఈ సారి అయిన నాన్ షేడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనులు కు హక్కుపత్రాలు మంజూరు చేయాలని కోరారు ఈకార్యక్రమంలో జి సూర్యనారాయణ ,ఇ ఆప్పారావు రాము దాసు శ్రీ ను ,తో పాటు వందలాది మంది గిరిజనులు పల్గోన్నారు .
No comments:
Post a Comment