జాప్ విశాఖ అధ్యక్షుడిగా శ్రీనివాస్
ఉపాధ్యక్షుడిగా రవికుమార్
విశాఖపట్నం, పెన్ పవర్
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) విశాఖ అధ్యక్షుడిగా సింగంపల్లి శ్రీనివాస్ నియమితులయ్యారు. బుధవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులుగా శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా రవికుమార్, వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గా చాంద్ మాల్ అగర్వాల్, కో చైర్మన్ గా సత్యనారాయణ నియమితులయ్యారు. సమావేశంలో ఎన్ యు జె నాయకులు ఎన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి జాప్ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. నూతనంగా పదవులు పొందిన వారు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. కోవిడ్ 19 వలన జర్నలిస్టులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నారని, వారికి జాప్ అండగా నిలుస్తుందని తెలిపారు. అధ్యక్షుడు గా నియమితులైన సింగంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమం లో జాప్ పాత్ర ఎనలేనిదని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి, జాప్ పురోభివృద్ధికి అందరితో కలిసి పని చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి ఎ ఆర్ పాత్రుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి డి కాశీనాథ్, ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్, కోశాధికారి టీవీఎన్ ప్రసాద్, కార్యదర్శులు కే ఎన్ కీర్తన్, ఎస్ ఆర్ సి మోహన్, సంయుక్త కార్యదర్శి శ్యాంసుందర్, కార్యనిర్వాహక కార్యదర్శి జగన్మోహన్, ఈసీ సభ్యులు మదన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment