Followers

కామరాజుపేట లో కరోనా కలకలం.




కామరాజుపేట లో కరోనా కలకలం.

 

గోకవరం పెన్ పవర్.

 

మండలంలోని కామరాజుపేట గ్రామంలో కరోనా సోకిన వ్యక్తి సంచరిస్తున్నాడనే సమాచారం కలకలం రేపింది. ఏలూరుకు చెందిన ఒక వ్యక్తి సుమారు వారం రోజుల క్రితం తన అత్తగారి స్వగ్రామమైన కామరాజుపేట రావడం జరిగింది. అయితే కామరాజుపేట రావడానికి ముందు ఆ వ్యక్తి కరోనా పరీక్షలు చేయించుకుని ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా ఆదివారం రాత్రి నిర్ధారణ కావడంతో గుట్టుచప్పుడు కాకుండా సోమవారం తెల్లవారుజామున ఆ వ్యక్తి కామరాజుపేట నుంచి పరారి కావడం జరిగిందని గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు.గ్రామంలో ఆ వ్యక్తి ఉన్న ఇంట్లో సుమారు పది మంది కుటుంబ సభ్యులు వరకు కలిసి ఉంటారని సమాచారం ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళన నెలకొంది.స్థానిక అధికారులు సంబంధిత ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు మీ ఇంటి నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలియవచ్చింది.



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...