Followers

పేదోడి సొంతింటి కల సాకారం చేయడం బీజేపీ లక్ష్యం


పేదోడి సొంతింటి కల సాకారం చేయడం బీజేపీ లక్ష్యం..

 

మండపేట పెన్ పవర్

 

మోసగించడం లో వైసీపీ , టీడీపీ లు రెండూ ఒక్కటే..

మండపేట: దేశంలో ఉన్న పేదలందరూ కలలు కంటున్న సొంతింటి కోరికను నెరవేర్చడమే బీజేపీ లక్ష్యం అని నియోజక వర్గ బీజేపీ కన్వీనర్ కోన సత్య నారాయణ పేర్కొన్నారు. బీజేపీ జనసేన పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆయన జనసేన పార్టీ నాయకులు శెట్టి రవి కుమార్ పార్టీ  కార్య కర్త లతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. స్థానిక టౌన్ హాల్ వద్ద బీజేపీ కార్యాలయం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ టీడీపీ , వైసీపీ పార్టీలు ప్రజలను మోసగించడం లో రెండూ ఒకటేనన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఇళ్ళ నిర్మాణం పేరు చెప్పి దోచుకున్నారని ఆరోపించారు. ఇటుక ఇటుకలో అవినీతి జరిగిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోరని ఎద్దేవా చేశారు. అడుగు అడుగు లో అరాచకమేనని విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర పార్టీ  సూచన మేరకు  10 గంటల నుండి  12 గంటల వరకు పేదల ఇళ్ళ కోసం బీజేపీ-జనసేన పోరుబాట పట్టామని అన్నారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ టి రామ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు 24 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చింది అన్నారు. ఇప్పటికి 5 వేల కోట్లు విడుదల చేసిందన్నారు. కేంద్రం పంపిన నిధులు ఏమయ్యాయో లెక్క చెప్పాలన్నారు. పేదల ఇళ్ళ విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు.   ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు తక్షణం  మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  గోళ్ళ శ్రీను, కొంతం ప్రసాద్, చంద్రమల్ల చిట్టియ్య, బండారు సతీష్, బొమ్మన సతీష్, పైడిమళ్ల సతీష్, మోటుపల్లి జానీ, జక్కా రామకృష్ణ, మోరం బాలాజీ, కనపర్తి వీర్రాజు, పోలిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...