కరోనా లాక్ డవున్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందించిన జనసైనికులు
పరవాడ పెన్ పవర్
పరవాడ మండలం : కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు,వికలాంగులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.గొరుపూటి శ్రీను, రాజేశ్వరి క్లాత్ అండ్ రెడీమేడ్ యజమాని మురుగన్ ల ఆర్థిక సహకారంతో సమకూర్చిన నిత్యవసర సరుకులను సుమారు 50 మంది నిరుపేదలకు ఐదు కేజీల నాణ్యమైన బియ్యం, తొమ్మిది రకాల కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మోటూరి సన్యాసినాయుడు , 79 వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కింతాడ ఈశ్వరరావు , చుక్కా నాగు, టిడిపి మాజీ కోఆప్షన్ నంబర్ గణపర్తి ఈశ్వరరావు, గుదె సంజీవ్, కరెడ్ల అభిరాం, కరెడ్ల లక్ష్మణ్, ఒడిసెల రాము, ఒడిసెల రాజు సన్నాఫ్ సూరిబాబు, మోటూరు హరి, తాడి గుఱ్ఱం నాయుడు, కరెడ్ల బ్రహ్మానందం, బీసీ కాలనీ చిరంజీవి, అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment