మరిడమ్మ దేవస్థానంలో పంచామృతాభిషేకం
ఘనంగా మఖ నక్షత్ర పూజలు
పెద్దాపురం ,పెన్ పవర్
మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని గురువారం పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం వేదపండితులు చిట్టెం హరిగోపాల శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే బంగారు, వెండి పుష్పాలతో అమ్మవారికి అర్చన నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించినట్టు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాలను పంపిణీ చేశారు.
No comments:
Post a Comment