Followers

సాంస్కృతిక కళాకారులకు మోడీ కిట్స్ వితరణ


సాంస్కృతిక కళాకారులకు మోడీ కిట్స్ వితరణ


పూర్ణా మార్కెట్, పెన్ పవర్


ఆదివారం ఉదయం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే కళాకారులకు మోడీ కిట్స్ వితరణ జరిగింది. బీజేపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఏం.రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి  సాగి కాశీవిశ్వనాథ రాజు విచ్చేసారు. ఈ సందర్భంగా  కాశీవిశ్వనాథ రాజు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని , అలాగే  ప్రధాన మంత్రి మోడీ  ఆదేశాల మేరకు ప్రజలందరూ సామజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఏం. రవీంద్ర  మాట్లాడుతూ ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది పేదవాళ్లకు మరియు వలస కూలీలకు నిత్యావసర వస్తువులు మరియు భోజనం అందించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న ఉచిత రేషన్ సరుకుల పంపిణీని నవంబర్ 2020 వరకు కొనసాగిస్తామని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రకటించారని అన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...