Followers

గ్రామంలో శానిటేషన్ పనులు ముమ్మరం





*గ్రామంలో శానిటేషన్ పనులు ముమ్మరం*

 

*ఆర్.బి. పట్నం పంచాయతీ సెక్రెటరీ పద్మరాజు*

 

పెద్దాపురం,పెన్ పవర్ 

 

పెద్దాపురం మండలం ఆర్.బి కొత్తూరు ఆర్. బి. పట్నం గ్రామాల్లో కరోనా పరీక్షలు చేయించుకున్న  వారిలో కరోనా ఉందని నిర్ధారణ అవ్వగా తక్షణం పంచాయతీ అధికారులు శానిటేషన్ పనులు ముమ్మరం చేశారు గ్రామ వీధుల్లో క్లోరిన్ రసాయనం బ్లీచింగ్ శానిటేషన్ పరికరాలతో గ్రామ వీధులన్నీ శానిటేషన్ చేశారు అలాగే గ్రామ వార్డు వాలంటరీ లు మెగా ఫోన్ ద్వారా గ్రామ వీధుల్లో ఇంటింటికి తిరిగి  తప్పనిసరిగా మాస్కు ధరించాలని పది నిమిషాలకు ఒకసారి శానిటేషన్ లిక్విడ్  రాసుకుని సబ్బుతో చేతులు కడుక్కోవాలి అని ఎవరికైనా కరోనా లక్షణాలు జ్వరం గాని రంప తలనొప్పి ఇటువంటి ఫ్లూ లక్షణాలు ఉంటే వెంటనే గ్రామ వాలంటీర్స్ ద్వారా తెలియజేయాలని వారు పంచాయితీకి తెలియజేసి ఏ.ఎన్.ఎం.ల ద్వారా పై అధికారులకి తెలియపరచడం జరుగుతుందని పంచాయతీ సెక్రెటరీ పద్మరాజు అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీస్ శైలజ పంచాయతీ గుమస్తా శీను. ఏసు. శివ. నాని. రాము. దివాకర్ తదితరులు పాల్గొన్నారు


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...