ఇండ్ల పథకం అవినీతిపై నిరసన కార్యక్రమం
బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ
చింతపల్లి ,పెన్ పవర్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరుతో ఉన్న ఇళ్ల నిర్మాణ పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటుందని, దీనికి నిరసనగా ఈనెల 22న,జనసేన సైనుకులను కలుపుకొని మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేయాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ అన్నారు. సోమవారం చింతపల్లిలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు జైతి ప్రభాకర్ అధ్యక్షతన ఆ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకుల గాంధీ మాట్లాడుతూ ఇప్పటివరకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మన రాష్ట్రానికి 20 లక్షల15 వేల 458 ఇళ్ళు మంజూరు చేసిందన్నారు. వీటి నిర్మాణానికి రూ.30 వేల 440 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. గత తెదేపా ప్రభుత్వం 3 లక్షల34 వేల 368 ఇళ్లు మాత్రమే నిర్మించిందన్నారు. మిగిలిన 16 లక్షల 81 వేల 90 ఇళ్ళు నిర్మాణం కాక నేటికీ అలాగే ఉన్నాయన్నారు. గత తెదేపా ప్రభుత్వం చదరపు అడుగు నిర్మాణానికి రూ.1 వెయ్యి ఖర్చు అయ్యేదానికి రూ.2,500 లుగా నిర్ణయించడం వలన భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు పూర్తయిన ఇండ్లను పేదలకు స్వాధీనం చేయకుండా తెదేపా ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వైయస్సార్ ప్రభుత్వం ఆరోపిస్తూ కాలయాపన చేస్తుందన్నారు.తెదేపా ప్రభుత్వ హయాంలో అవినీతి,అక్రమాలు జరిగితే దోషులను శిక్షించాలసింది పోయి పేదలను ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిధులతో పేదలకు నిర్మిస్తున్న ఇళ్ళలో భారీ అవినీతి జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ ప్రభుత్వం పక్షపాత ధోరణిని విడనాడి అవినీతి అక్రమాలపై పారదర్శకంగా వ్యవహరించి పేదలకు కేటాయించిన ఇండ్లను వారికి స్వాధీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపిటిసి అభ్యర్థి పొటుకూరి బాలరాజు, దేపూరి సోమలింగం, సాగిన బాలకృష్ణ, బొబ్బిలి వెంకటరమణ,పాంగి సుబ్బారావు,వసుపరి శ్రీనివాసు, అరిమెల రాజు,రోలంగి అచ్యుత్, కంకిపాటి లక్ష్మణ్ మరియు ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment