Followers

పెద్దేవం లో మొక్కలు నాటిన మంత్రి తానేటి వనిత


పెద్దేవం లో మొక్కలు నాటిన మంత్రి తానేటి వనిత.

 

 

 

పెన్ పవర్ తాళ్లపూడి

 

 

రాష్ట్రంలో పర్యావరణ పరి రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి  తానేటి వనిత అన్నారు. జగనన్న పచ్చ తోరణం లోభాగంగా పెద్దేవం గ్రామం లో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొక్కలను పెంచడం వల్ల ఫలసాయం, ఆక్సిజన్, లాంటి ప్రయోజనాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో  30 ల క్షల మంది పేదలకుఇళ్ళ స్థలాలు త్వరలో కేటాయిస్తామన్నారు. అర్హత ఉండి ఇళ్లు రానివారు దరఖాస్తు చేసుకుంటే తప్ప కుండా స్థలం కేటాయిస్తామన్నారు.  రాష్ట్రం లో 17వేల లే అవుట్లు వేసి 30లక్షల మంది పేదలకు ఉచితంగా కేటాయించిన ఇళ్ళ స్థలాల లో అన్ని చోట్ల ఈ రోజు మొక్కలు నాటే  కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల  మొక్కల నాటాలని నిర్ణయించామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మొక్కలు నాటి వాటిని  సంరక్షిస్తామని పచ్చదనాన్ని వెల్లివెరిసేలా చేస్తామని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కారణంగా అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని వచ్చిన సామాజిక పాటించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ, ఏ.యం.సి ఛైర్మెన్, వై. రమేష్ బాబు, కొవ్వూరు ఆర్డీవో, డి. లక్ష్మారెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దావీదు రాజు, మండల కన్వీనర్ కుంటముక్కల కేశవ  నారాయణ, నామా గోపాళం, నరాల శెట్టి వీర వెంకట రావు, ఎండపల్లి కృష్ణార్జునుడు, మైలవరపు రాధాకృష్ణ, పెరుగుల వీర్రాజు, సిర్రా గంగారావు, కొమ్మిరెడ్డి బ్రదర్స్, పోసిన కృష్ణదేవరాయలు, వంబోలు పోసిబాబు, పిట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...