త్రిశంకు స్వర్గంలోఎం.టి.ఎస్ లెక్చరర్ల ,వివిధ శాఖల ఎం.టి.యెస్ ఉద్యోగుల అగచాట్లు.
ఆత్రేయపురం, పెన్ పవర్
19 85 నుండి పార్ట్ టైం ఉద్యోగుల వ్యవస్థ ప్రారంభ మైనది.
గంటకు ఐదు రూపాయల నుండి , 10 రూపాయలు 20 రూపాయలు, నెలకు 1440, మూడు వేల ఒక వంద రూపాయలుగా నెలసరి జీతం క్రమ క్రమంగా పెరిగింది .1991లో జీవో నెంబర్ 278 ప్రకారం అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్ధనరెడ్డి పార్ట్ టైం లెక్చరర్లను రెగ్యులర్ చేయడానికి ప్రయత్నించారు. అనంతరం 302,305,365,14,45,221,212, 166 జి.ఓ లు రావటం జరిగినది.ఈ జి.ఓ లన్ని 1991 నుండి1995 మధ్యన రావటం జరిగినది. తర్వాత 1996లో212 జి.ఓ.ప్రకారం జూనియర్ కాలేజ్ ,డిగ్రీ కాలేజ్ లలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్ లను రెగ్యులర్ చేయడానికి అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం ప్రయత్నించి ,1985 నుండి 1988 మధ్యన పార్ట్ టైం ఉదోగులగా జాయిన్ అయిన సుమారు 500 మందిని 212 జి.ఓ ప్రకారం రెగ్యులర్ చేయడం జరిగినది. ఆ జీ.వో పరిధికి రానివారు ఈ రోజు నాటికి పార్ట్ టైం లెక్చరర్లుగా పని చేస్తున్నారు. 25 .11 .19 93 నాటికి 600 రోజులు లేక 1991 జూలై 31 నాటికి 360 రోజులు ఉన్నవారిని రెగ్యులర్ చేయడం జరిగినది. రెగ్యులర్ కాని ఎం.టి .ఎస్ లెక్చరర్,వివిధ శాఖల ఉద్యోగులు కోర్టును ఆశ్రయించడం జరిగినది. ఆ రెగ్యులర్ లో అనేక అవకతవకలు జరిగినవి .కట్ ఆఫ్ డేట్ నాటికి కొంత మందికి తేదీలు లేక పోయినా వారిని తెలుగు దేశం ప్రభుత్వం రెగ్యులర్ చేసినది.మరి కొంత మందికి 360 లేక 600 రోజులు ఉన్నప్పటికీ, రెగ్యులర్ చేయలేదు. దానికి కారణం 1989లో జాయిన్ అయిన పార్ట్ టైం వ్యక్తులను రెగ్యులర్ చేయలేదు.వీరు కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జాయిన్ అయ్యారు అని,వారికి పబ్లిక్ ,జాతీయ సెలవులు కలపలేదు.అలాగే పరీక్షలకు ఉపయోగించుకుని ఆ రోజులను పని దినాలుగా ప్రకటించలేదు.పేపర్ వాల్యూషన్ చేసిన రోజులను లెక్కలోకి తీసికోలేదు,1989 తరువాత అనగా కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జాయిన్ అయ్యిన వారిని పిరియడ్లను,అవర్, రోజులు, ప్రభుత్వ ,జాతీయ పరీక్షలు, పేపర్ వాల్యూషన్ రోజులు,రకరకాలు గా ఇడదీసి,వీరిని రెగ్యులర్ కాకుండా 1996లో తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుపడింది.తనకు కావలసిన వారికి పై శెలవులు కలిపి రెగ్యులర్ చేసింది.
దీనికి కారణం. 1989నుండి1995 మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంవల్ల వీరిని కాంగ్రెసు వాదులని తెలుగుదేశం ప్రభుత్వం 1996లో వీరిని రెగ్యులర్ చేయలేదు. 1989 నుండి ఈరోజు వరకు సుమారు 31 సంవత్సరాల సర్వీసు లో ఉన్న వీరికి, పే-డి .ఎ. మాత్రమే వస్తున్నది. పార్ట్ టైం లెక్చరర్ల నుండి ఎం.టి ఎస్ గా ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మార్పు చేసి,జీతాలు పెంచారు.త్వరలో రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ , ఆంధ్ర రాష్ట్ర ప్రజల,దురదృష్టం, మా దురదృష్టంమో, దురదృష్టవశాత్తు వారు ప్రమాదంలో మరణించడం వల్ల ,ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఎం.టి .ఎస్. గా చేస్తున్న జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల పనిచేస్తున్న,ఎం.టి.ఎస్ జనరల్ అధ్యాపకులు, ఒకేషనల్ అధ్యాపకులు, ల్యాబ్ అటెండర్ సమస్యలు, పరిస్కరిస్తారని, వై .ఎస్.రాజశేఖరరెడ్డి, ఆశయాలు నెరవేర్చే, వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిరు మాట గురించి ఎం.టి .ఎస్ గా పనిచేస్తున్న ,విద్య,యూనివర్సిటీ,ఖజానా,గ్రామ పంచాయతీ,మునిసిపల్ పట్టణాభివృద్ధి,జలవనరులు, పి.ఆర్ ఆర్.డబ్ల్యూ.ఎస్, పట్టు పరిశ్రమల శాఖ,గిరిజ శాఖ,బి.సి వెల్ఫేర్,ఎస్. సి.వెల్ ఫేర్,వాణిజ్య పన్నుల శాఖ,పశు సంవర్ధక శాఖ,అటవీ పర్యావరణ శాలలో సుమారు 5589 మంది,ఎం.టి.యెస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.వీరిని రెగ్యులర్ చెయ్యటం వలన ప్రభుత్వానికి ఏ విధమైన ద్రవ్య భారం లేదు,ఒక హెచ్.ఆర్.ఎ తప్పా.వీరు అందరూ 50 సంవత్సరాలు దాటినా వారే,చనిపోయే ముందు ,ప్రభుత్వ ఉద్యోగులు అనిపించే కుంటారు.లేక పోతే ఉద్యోగుల్లో, నిరుద్యోగులో తెలియకుండా మరణిస్తారు.31 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసిన వారికి వారి కోరిక తీర్చటం తప్పు కాదేమో,ఒక్కసారి మానవతా దృక్పథంలో ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వానికి, అధికారులకు,నాయకులకు ఉంది.
ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట గురించి ఎం.టి.ఎస్ ఉద్యోగులందరు ఎదురుచూస్తున్నారు. 2000 సంవత్సరంలో తెలుగుదేశం హయాంలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా జాయిన్ అయిన వారికి రెగ్యులర్ చేయడానికి మంత్రుల కమిటీ ప్రయత్నం చేస్తున్నారు.కానీ 1989లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారిని వదిలి, రెండువేల సంవత్సరములో , జాయిన్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయడం మంచిదే కానీ , వివిధ శాఖలకు సంబంధించిన ఏం.టి .ఎస్. ఎస్ అధ్యక్షులు ఈ సందర్భంగా1989 నుండి వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న, ఎం.టి.ఎస్ అయిన, మమ్ములను కూడా రెగ్యులర్ చెయ్యమని కోరుతున్నారు. ఎం. టి ఎస్ ఉద్యోగులకు సుప్రీం కోర్ట్, హై కోర్ట్, ట్రిబ్యునల్ కోర్ట్, రెగ్యులర్ చేయమని జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది .
పి.ఆర్ సి కూడా ఎం.టి. ఎస్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలపడం జరిగింది .వివిధ శాఖల ఎం.టి. ఎస్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘం నాయకులు, మంత్రి వర్గము ను, మంత్రుల సబ్ కమిటీని ,వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ లను, కమిషనర్లను ,కలిసి తమ సమస్యను విన్నవించుకోవడం జరిగినది .వారందరూ అలాగే తప్పనిసరిగా చూస్తామని తెలియ జేసారు .కానీ ఇప్పుడు అడుగుతుంటే కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయం చూస్తున్నాం. మీది ఆ తరువాత మాట్లాడుదాం చూస్తాం అంటున్నారు. ముందు ప్రభుత్వంలో పని చేసిన వారిని వదిలేసి వెనుక ప్రభుత్వం లో జాయిన్ అయిన వారి సమస్యలు చూడడం ఎంతవరకు సబబు అని వారు వాపోయారు. వారికి చేయండి, వారితో పాటు మాకు కూడా చెయ్యండి అని ప్రభుత్వం వారిని, సి.ఎం వై .ఎస్ జగన్ ఎం.టి.ఎస్ వివిధ శాఖల ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వ సబ్ కమిటీ తమ నిర్ణయాన్ని ,మంత్రివర్గ కమిటీ కి తెలియజేయ బాధ్యత ఉన్నది.
వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ లు, వారివారి శాఖల్లో ఉన్న వివిధ సమస్యలను మంత్రివర్గ మండలి ముందు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముప్పై రెండు సంవత్సరముల నుండి పనిచేస్తున్న వీరికి ఏ విధమైన ఇంక్రిమెంట్ కానీ,ఏర్న్ లీవ్ కానీ ,హెచ్. ఆర్
ఏ .గాని ,సి. సి ఏ గాని ,ఏ విధమైన ప్రమోషన్ లు గాని , పెన్షన్ కానీ లేకపోవటం మీరు చేసుకున్న పుణ్యఫలం మని వాపోతున్నారు. కావున ప్రభుత్వం వారు ,వివిధ శాఖలలో ఉన్న ఎం.టి.ఎస్ ఉద్యోగుల బాధలను అర్థం చేసుకుని పార్ట్ టైం ,ఫుల్ టైం కంటింజెంట్ ,మినిమం టైం, రోజువారి, కన్సల్టెంట్ లలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ముందుగా రెగ్యులర్ చేసి తరువాత కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులను రెగ్యులర్ చేయడం ధర్మ సమ్మతమని ఉద్యోగుల సంఘం నాయకులు తెలియజేస్తున్నారు .ఈ రోజు నాటికి సీఎం ను, కలవడానికి ఆస్కారం లేక తమ బాధలు చెప్పుకోవడానికి పర్మిషన్ లేక బాధపడుతున్నారు. వీరి బాధలను అర్థం చేసుకుని సీఎం ను కలవడానిక పర్మిషన్ ఇస్తారని, ఎదురుచూస్తున్నారని ఎం.టి ఎస్ ఉద్యోగుల సమస్యలను వింటారని, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తారని ,1989 నుండి ఇప్పటివరకు చేస్తున్నవారు కాంగ్రెస్ అభిమానులని, వీరిని తెలుగుదేశం ప్రభుత్వం ప్రక్కన పెట్టి నది,అన్నా విషయం సి.ఎం. జగన్ గ్రహిస్తారని ఎం.టి.యెస్ ఉద్యోగులందరు కోరు తున్నారు.సి.ఎం. ఈ సమస్యను పరిశీలించి 5589 ఎం.టి.ఎస్ ఉద్యోగ కుటుంబాలకు న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు. .
No comments:
Post a Comment