జగన్న పచ్చతోరణం కార్యక్రమం విజయవంతం చేయండి.
తాళ్ళూరు, పెన్ పవర్
తాళ్ళూరు మండలంలోని శివరామపురం గ్రామంలో వనమహోత్సవం జగనన్న పచ్చతోరణం కార్యక్రమ విజయవంతానికి మంగళవారం గ్రామ సచివాలయంలో ముందస్తు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీవో కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చోట్ల పచ్చదనాన్ని వ్యాపింప చేయాలని ఉద్దేశంతో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలన్నారు గ్రామ ప్రత్యేక అధికారి మండల విద్యాశాఖ అధికారి గురజాల సుబ్బయ్య మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు పరిసరాల పరిశుభ్రత పక్షోత్సవాలు జరగనున్నాయని వాటిని ఏ విధంగా నిర్వహించాలో వివరించారు గ్రామంలో ఎక్కడ ఎలాంటి అపరిశుభ్రత సమస్యలు లేకుండా చూడాలని ఆయన తెలిపారు దీనిపై కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో వనం మనం గ్రామ ప్రత్యేక అధికారి గ్రామ కార్యదర్శి పి శ్రీనివాసరావు సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు ఏఎన్ఎం మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment