కౌలు రైతు ధ్రువీకరణ పత్రాలపై అవగాహన సదస్సు
పరవాడ పెన్ పవర్
పరవాడ:మండలం లోని నాయుడు పాలెం రైతు భరోసా కేద్రంలో కౌలు రైతు ధ్రువీకరణ పత్రాల పై అవగాహనా సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరు అయిన తహసీల్దార్ పి.వి.ఎల్.ఎన్ గంగాధర్.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారిణి ఏవో చంద్రావతి రైతులకు ప్రభుత్వం కౌలు రైతులకు ఆర్ధికంగా ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన రైతు ధ్రువీకరణ పత్రాల పై రైతులకు బ్యాంక్ ల ద్వారా పంట రుణ సదుపాయం ఉంది అని తెలియ చేశారు.పట్టాదారు రైతులు కానీ కౌవులు రైతులు కానీ తప్పని సరిగా ఈ పంట నమోదును చేసుకోవాలి అని చెప్పారు.సి.హెచ్.సి(కస్టమ్ హైరింగ్ సెంటర్ గురించి అవగాహన కలిగించారు.మరియు రైతు భరోసా కేద్రంలో ఏర్పాటు చేసిన కియోస్కి పరికరం ద్వారా విత్తనాలు, ఎరువు ఎలా ఆర్థర్ చేసుకోవాలి అనే విషయాన్ని రైతు లకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ సంజీవరావు,ఏ.ఈ.ఓ వరలక్ష్మి,స్థానిక రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment