Followers

కాపు జాతికీ బీసీ రిజర్వేషన్లను కల్పించాలని గత ప్రభుత్వం పై ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ నేత ముద్రగడ.




కాపు జాతికీ బీసీ రిజర్వేషన్లను కల్పించాలని గత ప్రభుత్వం పై ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ నేత ముద్రగడ.

 

తూర్పుగోదావరి,పెన్ పవర్

 

    కాపు జాతికీ బీసీ రిజర్వేషన్లను కల్పించాలని గత ప్రభుత్వం పై ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ నేత ముద్రగడ. తన వెన్నంటే ప్రయాణం చేసిన గౌరవ కాపు సోదర సోదరీమణులకు తన నమస్కారములు తెలియజేస్తూ ఒక లేఖను  సోమవారం ఉదయం మీడియా కి విడుదల చేశారు. ఆ లేఖలో ఉద్యమనేత ముద్రగడ ప్రస్తావించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో కొంతమంది పెద్దలు  చాలామంది మన సోదరులు చేత తనను మానసికంగా కుంగిపోయే విధంగా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారని ముద్రగడ అన్నారు. తనపై వారు దాడులు చేయవలసిన అవసరం ఎందుకొచ్చిందో తనకైతే అర్థం కావడం లేదని ఆయన తెలిపారు. ఉద్యమం చేసిన కాలంలో తాను వసూలు చేసిన నిధులు గాని పారిశ్రామిక వర్గాలను బెదిరించి సంపాదించిన డబ్బులు గానీ, అప్పటి ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి వద్ద తాను లొంగిపోయి మూటలతో దండుకున్న కోట్లాది రూపాయలను. తనను నిత్యం విమర్శించే మన సోదరులకు పంచ లేదనా ఈ దాడికి కారణమని ఆయన పేర్కొన్నారు. తాను కాపు ఉద్యమాన్ని చేపట్టడానికి గల కారణం గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన జాతికి బి.సి రిజర్వేషన్ హోదా కల్పిస్తానని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నేపథ్యంలోనే అన్న సంగతి మీకు తెలియనిది కాదు. ఈ ఉద్యమం ద్వారా డబ్బులు గాని పదవులు గాని పొందాలని తాను ఏనాడు కోరుకోలేదని అలాగే ఉద్యమం లోకి వచ్చిన తర్వాత. తాను ఆర్థికంగానూ ఆరోగ్యపరంగా గానూ చాలా నష్టపోయానన్నారు. తాను రాజకీయంగా ఏ ఈ విధంగా నష్టపోయానో జాతి సోదరులందరికీ తెలియని కాదన్నారు. అలాగని తాను నష్టపోయిన దానికి ఎప్పుడూ  చింతించ లేదని ముద్రగడ అన్నారు. తుని  పాదయాత్ర బహిరంగ సభ అంత విజయవంతం కావడానికి తన గొప్పతనం వల్ల కాదని. అందుకు కారణం తమ జాతీ సోదరుల ఆకలికేకలన్నా సంగతి గుర్తించుకోవాలన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలను కుల సభలను చూసాను, విన్నానని అటువంటిది ఏ సభకైనా రెండు గంటలు ఆలస్యంగా వచ్చే ప్రజలకు, తునిసభకు అలా కాకుండా రెండు రోజులు ముందే చేరుకోవడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అది తనకెప్పుడు మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుందని ముద్రగడ అన్నారు. అలాగే ఈ మధ్య ఒకవ్యక్తి ఫోన్ చేసి మీ పోరాటం ద్వారా వచ్చే ఫలితాన్ని ఇతరులు కొట్టేసేలాగున్నారని కాబట్టి ఇతరులు ఇచ్చిన స్టేట్ మెంట్ కు సపోర్ట్ చేస్తూనే మీరు వారితో నడిచే చేయండి అని సలహా ఇవ్వడం పట్ల ముద్రగడ అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకు వారితో నడవాలి ఆనాడు తాను చేపట్టిన ఉద్యమం ఎనకాల వారందరూ నడిచే రా అలా నడవనప్పుడు వాళ్ళ కూడా నేను నడవాల్సిన అవసరం లేదు కదానీ పేర్కొన్నానన్నారు. ఎవరి ద్వారా నైనా రిజర్వేషన్ రానివ్వండి దానికి అందరు సంతోష పడదాం అని చెప్పడం జరిగిందని ఉద్యమ నేత వాపోయారు. ఇలా అనేక సందేహాలను కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తనదైన శైలిలో సందర్భం బట్టి తనపైన, తాను చేసిన ఉద్యమంపైన సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు దిగే వారిపై ఆయన విరుచుకుపడుతూ,, తన రాసిన లేఖలో ప్రస్తావించారు. ఆ నేపథ్యంలోనే తన జాతికి బిసి రిజర్వేషన్ కల్పించాలని చేపట్టిన కాపు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్లు గా లేఖ ద్వారా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి లో ఉన్న ముద్రగడ నివాసం నుంచి మీడియాకు విడుదల చేశారు.

 

 




 

Attachments area

 

 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...