Followers

  దళితుల మేనమామ నీవెక్కడ

  దళితుల మేనమామ గా చెప్పుకునే  ఏ.పీ. సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి 


*ఏపీలో మరో అరాచకం..... దళిత జడ్జి పై వై.సీ.పీ శ్రేణుల దాడి*


అయినా వెళ్లి పెన్ పవర్



*ఏపీలో దళితులపై అధికార పార్టీ నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గరగపాడు కఛులూరు లో జరిగిన బోటు ప్రమాదం లో 51 మంది చనిపోతే దాని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించి నందుకు మాజీ ఎం.పీ. హర్ష కుమార్ ను అక్రమ అరెస్ట్ చేసి 48 రోజులు జైలులో పెట్టారు. అలాగే గరగపాడు అంబేద్కర్ విగ్రహం ఘటనలో అరెస్ట్ చేశారు. అలాగే  మహాజన్ పార్టీ నాయకులైన సరిపల్లి  రాజేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, కాకినాడ, సామర్లకోట లో కేసులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టారు. అలాగే విశాఖలో డాక్టర్ సుధాకర్ గారి పై ,చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనిత రాణి పై జరిగిన దాడులు.. మరువకముందే, అదే జిల్లాలో దళిత జస్టిస్ పై కూడా అదే జులుం ప్రదర్శించారు. తంబలపల్లి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఏకంగా దళిత జడ్జి జస్టిస్ రామకృష్ణ పై దాడులకు తెగబడ్డారు. వైసిపి నేతలు చేస్తున్న రాజకీయాలను ప్రశ్నించిన పాపానికి జడ్జి పై వైసీపీ నేతలు భౌతిక దాడులకు పూనుకున్నారు. బి.కొత్తకోటలో దళిత జడ్జి రామకృష్ణ నివసిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా అధికార పార్టీ నేతలు చేస్తున్న భూ కబ్జాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి,  పోరాడుతున్నారు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఫిర్యాదు చేశారు అన్న , అక్కసుతో స్థానిక* *ఎమ్మెల్యే, మంత్రి అనుచరులు రెచ్చిపోయి, జడ్జి ఇంటి పైనే దాడి చేసి తమ దురహంకారాన్ని చాటుకున్నారు. గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన జడ్జి పదవిలో ఉన్న వారికే ఇలా జరిగితే సాధారణ ప్రజలు, దళితుల పరిస్థితి ఏంటని అందరూ విస్తుపోతున్నారు. ఇంత జరుగుతున్నా.. స్థానిక పోలీసులు మాత్రం దుండగుల పై కేసు నమోదు చేయకుండా చోద్యం చూడడం అనేక అనుమానాలకు తావిస్తోంది.  స్థానిక ఎమ్మెల్యే అండతో అధికార పార్టీ నాయకుల అక్రమాలు, దాడులు, వివక్ష రోజు రోజుకి ఎక్కువగా ఉందంటూ  బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని మాల మహానాడు గిడ్ల వెంకటేశ్వరరావు నేతలు ప్రకటించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి ,జడ్జి గారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాల మహానాడు జిల్లా* *అధ్యక్షులు గిడ్ల వెంకటేశ్వరరావు స్వేరో తెలిపారు. దళిత బహుజనులు ఇలాంటి దాడులకు భయపడకుండా, ముందుకు వచ్చి, అందరూ కలిసికట్టుగా పోరాడాలని కోరారు.దీనికి  అయినవిల్లి మండల మాలమహానాడు సంఘీభావం తెలిపింది.        ఈ కార్యక్రమంలో*                    *గిడ్ల వెంకటేశ్వరరావు, మద్దా చంటిబాబు ఎస్,దుర్గారావు , జంగా కృష్ణమూర్తి, వజ్రపు బాల కుమార్, బడుగు దుర్గారావు, కాకర శ్రీను, గిడ్ల సురేష్ ,కొట్టాల  మురహరి, మాగాపు ఈశ్వరరావు, నామాడి భీమయ్య, కుమ్మరి రమణ, మచ్చా నాగయ్య, పరమట సత్యనారాయణ, బండి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు*


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...