వివిధ వ్యాధుల నివారణకు మలాథీన్ స్ప్రేయింగ్
చింతపల్లి ,పెన్ పవర్
పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల ఆదేశాల మేరకు స్థానిక ఐటిడిఏ నివాస గృహాలు, మెట్ట బంగ్లా తదితర ప్రాంతాల్లో రెండవ విడత మలాదిన్ స్ప్రేయింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్ వైజర్ సాంసన్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ లు మాట్లాడుతూఎపిడెమిక్ సీజన్ ప్రారంభం కావడంతో విశాఖ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం మలేరియా,ఫలేరియా, డయేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రెండవ విడత మలాథియాన్ స్ప్రేయింగ్ నిర్వహించామన్నారు. గ్రామాలలో వర్షపు నీరు నిల్వ లేకుండాచేసుకోవలసిన భాద్యత ప్రజలపై ఉందన్నారు అదేవిధంగా ప్రతి ఇంటి లోపల, బయట స్ప్రేయింగ్ చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఇంటి చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలను తొలగించుకోవా లని, పిచ్చి మొక్కల వలన విష సర్పాలు సంచరించే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కెఎన్ నెహ్రూ, ఏఎన్ఎం సాగిన విజయలక్ష్మి, ఆశ కార్యకర్త కే పూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment