రైతులకు ఈ క్రాఫ్ట్ విధానంపై అవగాహన సదస్సు
గోకవరం పెన్ పవర్
మండల కేంద్రమైన గోకవరం గ్రామ సచివాలయంలో రైతులకు అగ్రికల్చర్ అధికారి పి. పద్మలత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఏ.పి.సీఎం. జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఈ క్రాఫ్ విధానాన్ని ప్రవేశపెట్టారని రైతులు ముఖ్యంగా ఈ క్రాఫ్ నమోదు చేయించుకోవలని ఆమె తెలిపారు. అదేవిధంగాఈ క్రాఫ్ బుక్ చేయించుకొని యడల రైతులుకు జరిగే నష్టాన్ని వివరించారు. ఈ క్రాఫ్ పై రైతులకు పూర్తి అవగాహన కల్పించారు ఈ గ్రాఫ్ బుక్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఆమె తెలియజేశారు.ఈ క్రాఫ్ బుక్ చెయ్యడం కోసం అధికారులే రైతులు వేసే పంట పొలాలకు వచ్చి నమోదు చేస్తారు అని చెప్పడం జరిగింది అంతే కాకుండా కౌలు రైతులందరు తప్పనిసరిగా CCRC కౌలు కార్డులు తీసుకోవాలని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు గురించి వాటిని రైతులు ఎలా ఉపయోగించుకోవలో రైతుభరోసా కేంద్రాలలో ఏ ఏ ఉత్పత్తులు దొరుకుతాయో రైతులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారి పి.పద్మాలత , voa సురేఖ మరియు వైసీపీ టౌన్ కన్వీనర్ చింతల అనిల్ మరియు గ్రామ రైతు సోదరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment