శాకంబరీ దేవి గా దర్శనం ఇచ్చిన గద్దె లో అమ్మవారు.
గోకవరం పెన్ పవర్.
గోకవరం మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ వీరభద్రుని గద్దె వద్ద ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు అమ్మవారు శాకంబరీ దేవి గా దర్శనమిచ్చారు. ఆషాడమాసంలో ప్రతి సంవత్సరం అమ్మవారిని పండిన కూరగాయలు మరియు పళ్ళ రకాలతో పళ్ళతో అమ్మవారిని అలంకరించడం వలన పంటలు బాగా పండి ప్రజల సుఖ సంతోషాలతో ఉంటారనే భక్తుల ప్రగాఢ నమ్మకం అని అర్చకులు కుమార్ శర్మ అన్నారు. ఆర్యవైశ్య మహిళా సంఘ సభ్యులు గ్రామస్తులు ఇచ్చిన కూరగాయలతో అమ్మవారిని అలంకరించ గా తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. అదేవిధంగా రాజమండ్రి దేవి చౌక్ అలంకారం లో ఉన్నటువంటి స్థానిక దేవిచౌక్ కూడా అర్చకులు జగన్నాథశర్మ మరియు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని రకరకాల కాయగూరలు తోనే డ్రై ఫ్రూట్స్ మరియు పలు రకాల తో అలంకరించ గా కనకదుర్గ అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు అందించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో భక్తులు మాస్కులు ధరించి ఒకరికొకరు దూరంగా అమ్మవారిని దర్శించుకోవడం విశేషం.
No comments:
Post a Comment