Followers

నాటుసారా తయారీకి ముడి సరుకులు రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్.


నాటుసారా తయారీకి ముడి సరుకులు రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్..


పోలవరం పెన్ పవర్


అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు వారి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా నాటు సారా తయారీ కి అవసరమైన ముడి సరుకులు రవాణా చేస్తున్న ట్రక్కు ఆటోను సీజ్ చేసినట్టు పోలవరం ఎన్ఫోర్స్మెంట్ సీఐ జి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం గోపాలపురం మండలం వెంకటాయపాలెం గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా  ఏపీ 37 టి ఆర్ 23 87 నెంబర్ గల అశోక్ లైలాండ్ ట్రక్ ఆటోలో రవాణా చేస్తున్న 800 కేజీల నల్ల బెల్లం, 50 కేజీల అమోనియా, కేజీ ఈస్ట్  నాటుసారా తయారీకి అవసరమైన ముడి సరుకులను , 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, రవాణా చేస్తున్న ట్రక్ ఆటోను సీజ్ చేసి పోలవరం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఘంటా మురళి కృష్ణ  ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సి ఐ జి సత్యనారాయణ తెలిపారు. సి ఐ జి సత్యనారాయణ వెంట సిబ్బంది  ఉన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...