ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్
రాయవరం, పెన్ పవర్
రాయవరం మండలంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా రావడం మరింత కలకలం గా మారింది. వివరాల్లోకి వెళితే బిక్కవోలు మండలం కొమరిపాలెంలోని ఓ రైస్ మిల్ యాజమాన్యంకు ఇటీవల కరోనా సోకింది. దీంతో అందులో పని చేసే సిబ్బందికి కరోనా పరీక్షలు జరిపారు. రాయవరం లో ఒకే కుటుంబ సభ్యులు ముగ్గురికి, వీ సావరంలో మరో ఇద్దరికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వీరందరినీ బొమ్మూరు క్వరంటైన్ కేంద్రానికి తరలించారు.
No comments:
Post a Comment