వ్యాధి ప్రబలకుండా హైపో క్లోరైడ్ పిచికారి
పూర్ణా మార్కెట్, పెన్ పవర్
రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ మరియు ప్రకృతి చికిత్సాలయం మహారాణి పేట జివిఎంసి మలేరియా శాఖవారి సహకారముతో బుద్ధవరపు గార్డెన్స్ లో మంగళవారం కరోనా వ్యాధి ప్రబలకుండా హైపో క్లోరైడ్ ద్రావణము పిచికారి చేశారు ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వైద్య విభాగము కన్వీనర్ రూపాకుల రవికుమార్ ప్రసంగిస్తూ కరోనా వ్యాధి నివారణ కోసము ఈ కార్యక్రమము చేస్తున్నామని అన్నారు మూడవ జోన్ పరిధిలో కరోనా ఎక్కువగా ఉన్నదని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సామాజిక దూరము పాటించాలని మాస్క్ దరించాలని అన్నారు . ప్రభుత్వం వారు చేయు కరోనా పరీక్షలు ఫలితాలను వెంటనే ఇవ్వటానికి ప్రయత్నం చేయాలని లేనిచో రోగికి వైద్యము చేయుట ఆలస్యము అయినచో జబ్బు తీవ్రత అవుతుందని అన్నారు ప్రజలు మనోధైర్యంతో ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సూచనలను పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి , ఎస్ మహేష్ ,డుతి ,గేదెల శ్రీహరి, జి.వి.ఎం.సి సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment