ఆన్ లైన్ సేవల తో కరోనా కట్టడి -ఎంవిఐ విఠల్
చింతూరు. పెన్ పవర్
:ఆన్ లైన్ సేవల వినియోగంతో కరోనా కట్టడికి దోహద పడ్డవారమౌతామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విఠల్ అభిప్రాయ పడ్డారు.ఈ మేరకు వాహనదారులకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో రవాణా శాఖకు చెందిన సేవలను ప్రజలు ఉన్నచోటినుండే పొందవచ్చని పేర్కొన్న ఆయన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ (కాకినాడ) సీహెచ్.ప్రతాప్ జారీచేసిన ఆదేశాల వివరాలను ఎంవిఐ విలేకరులకు వెల్లడించారు. సెకండ్ హ్యాండ్ వాహనాల పరిశీలన,పట్టుబడ్డ వాహనాలను విడిపించుకోవటం, తపాలా శాఖ ద్వారా వెనక్కి తిరిగివచ్చిన వాహన,డ్రైవింగ్ లైసెన్స్ ల స్మార్ట్ కార్డు పొందటం,ఇతర రికార్డ్ ల సవరణ తదితర సేవలు వినియోగానికి ఆర్టీవో కార్యాలయ వాట్సాప్ నెంబర్ 7670931573 ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అలాగే కొన్ని వాహనాలు తనిఖీ నిమిత్తం చూపవలసి ఉన్నందున వాటి వివరాలకై స్థానిక రవాణా శాఖా కార్యాలయ నెంబర్లలో కూడా సంప్రదించ వచ్చని ఎంవిఐ పేర్కొన్నారు.
No comments:
Post a Comment