రైతుకు బహుళ ప్రయోజనం కల్పించేందుకు ఈ క్రాపింగ్ బుకింగ్ విధానం
జిల్లా సంయుక్త కలెక్టర్ జె వెంకట మురళి
(పెన్‌పవర్, ఒంగోలు)
వ్యవసాయ రంగంలో రైతులకు బహుళ ప్రయోజనం కల్పించడానికి ఈ - క్రాపింగ్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్.బి.అండ్‌ఆర్) జె. వెంకట మురళి తెలిపారు. ఈ - క్రాప్ బుకింగ్ విధానంపై బుధవారం కొత్త పట్నం మండలం గమండ్లపాలెం గ్రామాన్ని ఆయన పరిశీలించారు. రైతులకు అన్ని విధలుగా ప్రయోజనం కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జె.సి. తెలిపారు. ఈ - క్రాప్ బుకింగ్ విధానం ద్వారా రైతు పండిరచిన పంటకు మద్దతు ధర భించేలా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. భవిష్యత్తులో లాభసాటి వ్యవసాయం కోసం సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహధం పడుతుందన్నారు. రైతులతో ముఖాముఖిగా ఆయన మాట్లాడారు. ఈ - క్రాప్ విధానంతో రాయితి పై విత్తనాలు, భీమా, రైతు భరోసా ఆర్థిక సహాయం, పంట స్థిరీకరణ నిధి వర్తిస్తుందని రైతులకు ఆయన వివరించారు. ముందుగా రైతులనుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు సాగుచేస్తున్న పంట నమోదు ప్రక్రియను జె.సి. స్వయంగా పరిశీలించారు. అగ్రిక్చరల్ అసిస్టెంట్ చేస్తున్న విధుల పై ఆయన ఆరాతీశారు. ఈ - క్రాప్ బుకింగ్ లో రైతు ఆధార్ కార్డు నెంబరు, భూమి సర్వే నెంబరు నమోదు చేసి అగ్రిక్చరల్ అసిస్టెంట్ వేలిముద్ర ధృవీకరణతో వి.ఆర్.ఓ. లాగిన్‌కు పంపడంపై ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. తదుపరి వ్యవసాయ శాఖ అసిస్టెంట్ లాగిన్ కు వచ్చిన అనంతరం ప్రభుత్వానికి వివరాలు సమర్పించే ప్రక్రియ వద్ద సాంకేతిక సమస్య తలెత్తుతున్నాయని అగ్రి కల్చరల్ అసిస్టెంట్ జె.సి. దృష్టికి తెచ్చారు. వీటిపై పలుమార్లు పరిశీలించిన అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని జె.సి. అన్నారు. ఆయన వెంట కొత్త పట్నం మండల తహసిల్దార్ వి. పుల్లారావు, వ్యవసాయ అధికారిణి సుచరిత, సర్వే వి.ఆర్.ఓ, తదితయి వున్నారు.
No comments:
Post a Comment