టిడిపి సీనియర్ నాయకుడు భాషా జానీ మృతి ..
సంతాపం తెలిపిన మండల నాయకులు
పోలవరం పెన్ పవర్
తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కో ఆప్షన్ సభ్యులు షేక్ బాషాజానీ మంగళవారం తెల్లవారుఝామున పోలవరం బీసీ కాలనీలో ఆయన నివాసం వద్ద కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన గత 30 సంవత్సరాలుగా టీడీపీలో సీనియర్ నాయకుడిగా టీడీపీ కి ఎన్నో సేవలందించారు. ప్రతిపక్ష నాయకులతో సైతం స్నేహభావంతో మెలిగి అజాత శత్రువుగా పేరుగాంచిన బాషాజానీ మృతి టీడీపీకి తీరని లోటని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ అన్నారు . టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ బోరగం శ్రీనివాస్ ,టిడిపి పోలవరం మండల అధ్యక్షులు పాపోలు గణపతి రత్తయ్య,మాజీ ఎంపీటీసీలు ఏనుగుల శ్రీనివాస్, మర్రి సత్యవతి తదితరులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఆయన మృతికి సంతాపం,ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగత మాజీ శాసన సభ్యులు పూనెం శింగన్నదొర తనయుడు పూనెం రామ్మోహనరావు బాషాజానీ మృతికి తన సంతాపం తెలిపి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
No comments:
Post a Comment