Followers

ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ మరియు సెల్సే రిప్రెజంటేటి వ్స్  ఆధ్వర్యంలో నిరసన


ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ మరియు సెల్సే రిప్రెజంటేటి వ్స్  ఆధ్వర్యంలో నిరసన


 


 


అక్కయ్యపాలెం, పెన్ పవర్


 


 


ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ మరియు సెల్సే రిప్రెజంటేటి వ్స్  రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విశాఖప్నంలోని కార్మిక శాఖ(లేబర్ ఆఫీస్) ఎదురుగా ఉపాధ్యక్షులు మంగళ్ దాన్ అధ్యక్షతన నిరసన కార్య క్రమం జరిగింది.

జిల్లా కార్యదర్శి డి. స్రవంత్ మాట్లాడుతూ ఈ కరోనా కాలంలోనే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చింది అంతే కాక మెడికల్ రిప్రెజంటేటి వ్స్  కీ రక్షణ కవచంలా వున్న ఏస్ పి ఈ ఆక్ట్ ను పూర్తిగా తొలగించడం జరిగింది, అలాగే కారోనాని ఆసరాగా తీసుకుని మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు జీతాలు ఎగ వేయడం, కోత పెట్టడం,ఉద్యోగాలు తీసివేయడం అన్యాయమని తెలియజేశారు.

రాష్ట్ర కార్యదర్శి కె వి పి చంద్ర మౌళి మాట్లాడుతూ ఫార్మా రంగం కరిన కాలంలో కూడా విపరీతమైన లాభాలు ఆర్జించినప్పటికీ కూడా  జీతాలు కోత విధించటం, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం అన్యాయమని తెలియజేశారు.

ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర  ప్రధనకార్యదర్శి  టి.కామేశ్వరరావు మాట్లాడుతూ కరోనా కాలంలో కూడా అనైతిక విధానాల ద్వారా ప్రమోట్ చేయడం మందుల ధరలు  విపరీతంగా పెంచడం చాలా అన్యాయమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...