Followers

గంజాయి అక్రమ రవాణా



గంజాయి అక్రమ రవాణా

 

 ఐదుగురు  అరెస్ట్

 

రెండు ఆటోలు సీజ్.

 

చింతపల్లి , పెన్ పవర్ 

 

మన్యప్రాంతం నుంచి మైధాన ప్రాంతానికి ఆటోలలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చింతపల్లి పోలీసులు పట్టుకున్నారు.స్థానిక సీఐ టీ.శ్రీను సోమవారం సాయంత్రం అందించిన వివరాల ప్రకారం ముందస్తు సమాచారం మేరకు యస్ఐ మహమ్మద్ ఆలీ షరీఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఉధయం మండల కేంద్రాన్ని ఆనుకొని ఉన్న అంతర్ల గ్రామం వద్ద తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా వస్తున్న రెండు ఆటోలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఆటోలలో గంజాయి ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. గంజాయితో పాటు ఆటోలలో వున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని గంజాయితో సహా రెండు ఆటోలను స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం  జరిగిందన్నారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి సుమారు 90 కి.లో లుగా ఉందన్నారు. దీని విలువ సుమారు రూ.1 లక్షా 80 వేల వరకు ఉంటుందన్నారు.అక్రమంగా  గంజాయిని తరలిస్తున్న  ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. వీరంతా జీకేవీధి మండలం దామనాపల్లి పంచాయతీ మాడెం గ్రామానికి చెందిన వారని సీ ఐ శ్రీను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక యస్ఐ మహమ్మద్ ఆలీ షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...