బోస్ ను వెంటనే న్యాయస్థానంలో హాజరు పర్చాలీ
ప్రత్తిపాడు,పెన్ పవర్
ఏలేశ్వరానికి చెందిన న్యాయవాది పైల సుభాష్ చంద్రబోస్ ,కుటుంబ సభ్యుల పట్ల పోలీసుల తీరు సరికాదని ప్రతిపాడు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ఆదేశాల మేరకు బోస్ ను వెంటనే న్యాయస్థానంలో హాజరు పర్చాలని కోరుతూ ప్రత్తిపాడులో న్యాయవాదులు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం జరిగిన సభలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొగత శివ మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని దిక్కరించి రాత్రివేళ న్యాయవాది ఇంటికి వెళ్లడం సరికాదన్నారు పోలీస్ శాఖ బోస్ ను న్యాయస్థానంలో హాజరు పరచకపోతే అన్ని ప్రాంతాల్లో ఆందోళన నిర్వహిస్తామని ఈమేరకు అసోసియేషన్ తీర్మానాన్ని ఆమోదించింది ఈ కార్యక్రమంలో కల్చరల్ కార్యదర్శి మధు మహిళా ప్రతినిధి దేవి సీనియర్ సభ్యులు పుల్లయ్య చిట్టిబాబు కాళీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment