Followers

పర్యావరణ పరిరక్షణ





పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత___ మంత్రి విశ్వరూప్

 

అమలాపురం పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్

 

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు  ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పచ్చ తోరణం ( వన మహోత్సవం)కార్యక్రమాన్ని పురస్కరించుకొని బుదవారం మంత్రి అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ తో కలిసి అల్లవరం మండలం కోడూరుపాడులో పేదల కొరకు తీసుకున్న ఇండ్ల స్థలాలు వద్ద మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు ఎంతగానో ఉపయోగ పడతాయని, మొక్కలు పెంచడం ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని  మంత్రి సూచించారు. లక్ష్యా లను నిర్దేశించుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితే జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా రాష్ట్రం హరిత ఆంధ్ర ప్రదేశ్ గా మారుతుందని మంత్రి అన్నారు. అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కు మొక్కలు ఎంతగానో తోడ్పడుతాయని,జీవనాధారమైన మొక్కలను నాటడమే కాకుండా వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎం.పి సూచించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, అల్లవరం మండల తహశీల్దార్ అప్పారావు, ఎం.పి.డి. ఓ,సుగుణ శ్రీకుమారి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎన్.బి.ఎన్.వి. హరికుమార్, ఇళ్ళ శేషారావు, కొనుకు బాపూజీ, బొమ్మి ఇజ్రాయిల్,గుబ్బల బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.

 

అనంతరం మంత్రి అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి లో కూడా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా తీవ్రత ఎక్కువగా వున్న దృష్ట్యా ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరిస్తూ వైరస్ సోకకుండా స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొక్కా ఆదినారాయణ, అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి వసంత రాయుడు, మండల తహశీల్దార్ మాధవరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎన్.బి.ఎన్.వి. హారికుమార్, అమలాపురం మాజీ జడ్పీటిసి సభ్యులు కుడుపూడి వేంకటేశ్వర (బాబు), బొంతు గోవిందశెట్టి, కాట్రు చంద్రమోహన్, కుడుపూడి ఈశ్వరరావు, ఏ.పి. ఓ శ్రీమతి శివకుమారి,మాజీ ఎం.పి.టీ.సి.కుడిపూడి జగదీశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...