పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి
స్వచ్ఛభారత్ మరుగుదొడ్ల పై విచారణ జరపాలి
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ
పెన్ పవర్ కూనవరం.
పోలవరం నిర్వాసితుల సమస్యలపై మండలంలో నిర్మించిన స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల నిర్మాణాల అవకతవకలపై విచారణ జరపాలని బుధవారం నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నోముల రామారావు, పాయం వెంకయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మండల తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసిత గ్రామ ప్రజలు సర్వం త్యాగం చేస్తున్నారు కనుక నష్టపరిహారం,పునరావాసం,భూమికి భూమి ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. మండలంలో బొజ్జరాయి గూడెం ఒక్క గ్రామానికే పునరావాసం కల్పిస్తున్నారు కావున ప్రభుత్వం మండలంలోని మిగతా 40 నిర్వాసిత గ్రామాలకు కూడా న్యాయం చేయాలని కోరారు. మండలంలోని 52 గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మిస్తున్న 5,500 ఇళ్లకు గాను సుమారు 14 కోట్ల రూపాయల మంజూరైన నిధులలో సుమారు ఐదు కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని బిజెపి పార్టీ నిజనిర్ధారణలో తేలిందని అన్నారు. అయ్యవారిగూడెం, బురద గూడెం, పాలగూడెం, బోదునూరు,గోమ్ముగూడెం గ్రామాలలో అసంపూర్తిగా మిగిలిపోయాయని మరుగుదొడ్ల పై విచారణ జరపాలని జిల్లా అధికారులకు నివేదిక సమర్పించాలని మండల తాసిల్దార్ ఏ వి ఎల్ నారాయణకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిట్టురి వెంకటస్వామి, నోముల సత్యనారాయణ, గుండారపు శ్రీనివాస్ రావు, బి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment