అది మండల కేంద్రమా..మురికి కూపమా
గూడెం కోత్త వీధి ,పెన్ పవర్
పేరుకే అది మండల కేంద్రం కానీ రోడ్లు డ్రై నేజిలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. వర్షం కురిస్తే చాలు రోడ్ల పై నీరు వరదలా ప్రవహిస్తుంది.ఈ సమస్య ఏళ్ల తరబడి గిరిజనులు ఎదుర్కొంటున్న అధికార్లకు మాత్రం పట్టడం లేదు. మండల కేంద్రానికి వెళ్ళే మైయిన్ రోడ్డు పరిస్థితి
వర్ణనా తీతంగా మారింది. సిమెంట్ రోడ్లు నిర్మించిన అదికార్లు రోడ్లు పక్కన డ్రైనేజ్ లు నిర్మిచకపోవడం వల్ల వర్ష కురిస్తే మురుగు నీరు వచ్చి ఎక్కడికక్కడే నిల్వ ఉండిపోతుంది. ద్విచక్ర వాహనాలు పాదచారులు రాక పోకలు నరకప్రాయగా మారింది దీంతో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు రోడ్లు మీదకు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ కాలవలు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయి. కానీ నీత్యం నీరు ఉండటంవల్ల. దోమలు సైరవిహారంచేస్తున్నాయాని భాదితులు వాపోతున్నారు. వింటివల్ల మండల కేంద్రంలోని ప్రజలు దుర్వాసన. దోమల బెడదతో త్రివ ఇబ్బందులు పడటమైకాకుండా. డేంగ్యూ. మలేరియా. వైరల్ జ్వరాలు. అనేక రోగాలు బారినపడుతున్నా. అధికారులు మాత్రం డ్రైనేజ్ కాల్వల నిర్మాణం కోసం
పట్టించుకోలేదని మండల కేంద్రం ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరుయ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు స్పందించి క్షిణించిన డ్రైనేజ్ వ్యవస్థ ను మేరుగు పరచాలని స్థానికులు కోరుతున్నారు.
No comments:
Post a Comment