Followers

 అనంతగిరి పోలీసులకు చిక్కిన భారీ గంజాయి


 అనంతగిరి పోలీసులకు చిక్కిన భారీ గంజాయి



   విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)  


 


జిల్లాలోని అనంతగిరి మండలం దముకు  వద్ద గురువారం భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. అనంతగిరి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ అక్రమ గంజాయి రవాణాని  శోధించి పట్టుకున్నారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు డి ఎల్ 4 సీ ఎన్  ఈ 1300 నంబరు గల కార్ లో 120 కిలోల శీలవతి గంజాయి రవాణా  చేస్తుండగా పట్టుబడింది. కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు లో ఇద్దరు పరార్ కాగా సెంబి ప్రసాద్ ని  అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి గంజాయి కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని   అంచనా.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...