*అదుపుతప్పిన లారీ త్రుటిలో తప్పిన పెనుప్రమాదం.*
ఆలమూరు, పెన్ పవర్:
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో కొందరు అధికారుల నిర్లక్ష్యం వలన పలు వాహనదారులకు శాపంగా మారింది. వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే జొన్నాడ - కాకినాడ ఆర్ అండ్ బి రోడ్డు తరచూ ప్రమాదాలకు నిలయంగా మారింది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రమైన ఆలమూరు సెంటర్లో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గల మలుపులో ఓ లారీ డ్రైన్లో దిగబడి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఒక్క అడుగు ముందుకు వెళ్లి ఉంటే ప్రక్కనే గల 11కెవి విద్యుత్ ట్రాన్స్ పరం పై పడి ప్రాణనష్టం సంభవించేదని స్థానికులు తెలిపారు. ఆలమూరులో చిన్నపాటి వర్షం వస్తే అన్ని రోడ్లు జలమయం అయ్యి రోడ్డు వెంబటి ఉన్న డ్రైన్లు నీటితో నిండిపోయి కనిపించకుండా పోతున్నాయి. రోడ్డుపై వెళ్లే వాహనదారులకు డ్రైన్లో వాహనాలు దిగబడి అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. డ్రైన్లు మట్టితో పూడుకుపోవటం వల్లనే నీరు పారక ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటు పంచాయతీ అధికారులు కానీ, అటు ఆర్ అండ్ బి అధికారులు కానీ రోడ్డుని పూర్తిగా వదిలేయడంతో వాహనదారులకు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ వారు డ్రైన్లలోని పూడికను తీసి ప్రమాదాల జరగకుండా నివారిస్తాయని వాహనదారులు కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment