భవనంపై నుంచి దూకి ఆటోడ్రైవర్ ఆత్మహత్య.
ఆరిలోవ/ విశాఖపట్నం, పెన్ పవర్
ఆరిలోవ శ్రీకాంత్ నగర్ శనివారం ఉదయం భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే శ్రీకాంత్ నగర్ లో నివాసముంటున్న భూతల శ్రీను మహేష్ 48 అనే ఆటో డ్రైవర్ నాలుగు అంతస్తుల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనాలాక్ డౌన్ కారణంగా ఆటో సర్వీసులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. దీనికితోడు ఆటో ఈ ఎం ఐలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో కుటుంబ పోషణ ఆటో ఈ ఎం ఐ సమస్య ఎదుర్కోలేక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment