వృక్షో రక్షతి రక్షితః మంత్రి విశ్వరూప్
అల్లవరం పెన్ పవర్:
తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామంలో జగనన్న పచ్చతోరణం(వన మహోత్సవం) కార్యక్రమంలో భాగంగా మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది అన్నారు. వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంత రాయుడు ,పలువురు ప్రభుత్వ అధికారులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment