Followers

లొంగిపోయిన మావోయిస్టు



ఏఎస్పి విద్యాసాగర్ నాయుడు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సహకారి కేశవరావు.

 

 చింతపల్లి జూలై15  పెన్ పవర్

 

 మృతి చెందిన సిపిఐ మావోయిస్టు జాంబ్రి కుమారుడు గెమ్మెలి కేశవరావు చింతపల్లి ఏఎస్పి విద్యాసాగర్ నాయుడు సమక్షంలో లొంగి పోయాడు.ఈ సందర్భంగాఏ ఎస్ పి మాట్లాడుతూ గూడెంకొత్తవీధి మండలం మెట్టగూడ, వీరవరం పరిసర ప్రాంతాలలో మావోయిస్టుల కార్యకలాపాలలో సహాయ సహకారాలు అందించడంలో చురుకుగా పాల్గొనేవాడన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితుడై లొంగిపోయాడని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు రూరల్ పోలీస్  చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ పనులతో కేశవరావు ఆకర్షితుడయ్యాడన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం సాగించాలని సూచించడం జరిగిందన్నారు. ఇప్పటి నుండి అసాంఘిక కార్యక్రమాలకు పాలుపడనని తెలిపాడని ఆయన తెలిపారు. మావోయిస్టుల హింసను విడనాడి లొంగి పోయినట్లయితే దాని కనుగుణంగా రావలసిన ఇతర ఆర్థిక పరమైన ప్రయోజనాలను, ప్రభుత్వసంక్షేమ పతకాలు ప్రభుత్వము నుండి అందేటట్టు చూస్తామని ఆయన భరోసా యిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు సహకరిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గూడెంకొత్తవీధి సిఐ మురళీధర్ పాల్గున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...