Followers

కరోనా పాజిటివ్ నిండు గర్భిణీ కి ప్రసవం చేసి మానవత్వం చాటుకున్న వైద్యులు

కరోనా పాజిటివ్ నిండు గర్భిణీ కి ప్రసవం చేసి మానవత్వం చాటుకున్న వైద్యులు.


  విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


కరోనా పాజిటివ్ కేసు అనగానే ఆమడ దూరం పారిపోవడం సహజం. కానీ అదే  కరోనా పాజిటివ్ తో  ఉన్న ఒక నిండు గర్భిణీ కి శస్త్రచికిత్స చేసి  ఇద్దరు డాక్టర్లు  మానవత్వం చాటుకున్నారు. విశాఖ ఉక్కు నగరంలో  గురువారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉక్కు నగరానికి చెందిన  కరోనా పాజిటివ్  వచ్చిన నిండు గర్భిణీ  ప్రసవ వేదనతో ఉంది. ఈమెను విమ్స్ కు తరలించారు.  అనుమతి లేకపోవడంతో ప్రధమ ఆస్పత్రికి  రిఫర్ చేశారు. అక్కడా నిరాశే ఎదురైంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు  ఆస్పత్రుల చుట్టూ తిప్పి ఫలితం లేకపోవడంతో  ఉక్కు నగరం లో జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కరోనా రోగి అన్న విషయం మర్చిపోయారు. నిండు గర్భిణీ ప్రసవ వేదనకు  చలించిపోయారు. తక్షణం ఆసుపత్రిలో చేర్చుకొని కోవిడ్  19 నిబంధనల మేరకు  భద్రతను పాటించి  నిండు గర్భిణికి  సిజేరియన్ చేసి ప్రసవం కావించారు. తల్లి బిడ్డ ఆస్పత్రిలో ఉన్నారు. కరోనా పాజిటివ్ నిండు గర్భిణీ కి మానవత్వంతో పురుడు పోసిన వైద్యులు సుజాత అనంతలను ఉక్కు కార్మికులు  కృతజ్ఞతలు తెలియజేశారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...