Followers

సాగు దారునికి హక్కు పత్రాలు పై అవగాహన  


సాగు దారునికి హక్కు పత్రాలు పై అవగాహన                    


 

పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ చార్జి

 

 పొలం యజమాని యొక్క హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులను  బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తహసిల్దార్ శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం మండలంలోని కొండముడుసుపాలెం  గ్రామంలో రైతు భరోసా కేంద్రం లో రైతులకు సాగు దారి హక్కు పత్రాలపై వ్యవసాయ అధికారి అబ్దుల్ రహీం అధ్యక్షతన రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానం భూములు, ఈనామ్ భూములు సాగు చేసే రైతులు విధిగా ఈ పత్రాలు పొంది చట్టబద్ధత తెచ్చుకోవాలన్నారు. మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రహీం మాట్లాడుతూ ఈ పత్రాల ఆధారంగా బ్యాంకులో పంట రుణాలు, రాయితీ విత్తనాలు, ఎరువులు ఇతర అవకాశాలు కౌలు రైతులు పొందవచ్చునని అన్నారు. మండల పశు వైద్యాధికారి ఏందోటి  చెన్నకేశవులు మాట్లాడుతూ త్వరలో రైతు భరోసా కేంద్రం లో పశు సంవర్ధక శాఖ ద్వారా వివిధ రకాల మందులు, దానా విక్రయాలు జరుగుతాయని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యానవన శాఖ అధికారిని రమాదేవి, విఆర్ఓ,  పంచాయతీ సెక్రటరీ, వాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...