మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు స్థలం పరిశీలించిన మంత్రి
ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రలలో డాక్టర్లు
అందుబాటులో ఉండాలి..డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...
రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా ..
వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం..
పోలవరం పెన్ పవర్
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతం లో గిరిజనులకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. సోమవారం బుట్టాయగూడెం మండలం పర్యటించిన ఆళ్ల నాని మంజూరైన మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ కు స్థలం పరిశీలించారు. బుట్టాయి గూడెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం కమ్యూనిటీ హాస్పిటల్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న మెడికల్ సిబ్బంది పోస్టులు వెంటనే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజును ఆదేశించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ లో వెంటనే మొబైల్ ఎక్సరే యూనిట్ ఏర్పాటు చేయాలన్నారు. బుట్టాయిగూడం లో 10ఎకరాలు స్థలంలో 75కోట్లు రూపాయలతో మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.రాష్ట్రము లో 7ఐ టి డి ఏ పరిధిలో మల్లీ స్పెషలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని అన్నారు. కోవిడ్ -19, చికిత్స ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని లక్ష్యం తో ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల ఏర్పాటు కు 11, 400కోట్లు రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక్కొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రము లో 11ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ఉండగా.. అదనoగా మరో 16ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఏజెన్సీ లో అంటు వ్యాధులు ప్రబల కుండా చూడాలని వైద్యం అందించడం లో అలసత్వం వహిస్తే మీరే బాధ్యత వహించాలి హెచ్చరించారు.వర్ష కాలంలో అంటు వ్యాధులు ప్రభలకుండా ముందోస్తూ జాగ్రత్త లు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు కార్పొరేట్ వైద్యం అందించాలని మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణం వల్ల పోలవరం నియోజకవర్గం ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.స్త్రీల అనారోగ్యం సమస్య లు పరిస్కారంకు కొత్తగా నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ఎంతగానో దోహదపడుతుంది అన్నారు. వారం రోజుల్లో ఏజెన్సీలో పర్యటిస్తానని మెడికల్ క్యాంపులు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, ఐటిడిఎ పిఓ సూర్యనారాయణ, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సునంద, డి సి హెచ్ డాక్టర్ శంకరరావు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ళపల్లి జయప్రకాష్, ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డు మెంబర్ డాక్టర్ డి వరప్రసాద్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment