ఏలేరు రిజర్వాయర్లలో చేపల వేట పై నిషేధం
ఏలేశ్వరం, పెన్ పవర్
ఏలేరు రిజర్వాయర్ లో చేపల వేటను నిషేధించినట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు. వర్షాకాలంలో జూన్, జూలై ,ఆగస్టు మూడు నెలలపాటు చేపలు గుడ్లు పెట్టే దశ అయినందున మత్స్య సంపద భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఈ కారణంగానే ప్రతి ఏటా వర్షాకాలంలో మూడు నెలల పాటు చేపల వేట నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మత్స్యకారులకు హెచ్చరించారు.
No comments:
Post a Comment