శీతల గిడ్డంగులు నిర్మాణం చేపట్టాలి.
..... కాపు యువజన సంఘం అధ్యక్షులు మంగరాతి చందు.
గోకవరం పెన్ పవర్.
గోకవరం మండలంలో శీతల గిడ్డంగుల నిర్మాణం కోసం కాపు యువజన సంఘం అధ్యక్షుడు మంగరాతి చందు ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం చందు మాట్లాడుతూ గోకవరం మండలం ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతమని ఈ మండలంలో ఉన్నటువంటి జనాభాలో అధిక శాతం వ్యవసాయ దారులు ఉన్నారని ఈ ప్రాంతంలో ప్రధానంగా పండించే వ్యవసాయ ఉత్పత్తులు వరి ,మొక్క జొన్నలు, అపరాలు, జీడిమామిడి పిక్కలు, మొదలగునవి . ఇటు వంటి వ్యవసాయ ఉత్పత్తులను అననుకూల వాతావరణ పరిస్థితుల నుండి రక్షించుకొనుటకు మరియు రైతుకు గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తిని నిల్వ చేయుటకు, తగిన ఏర్పాట్లు లేని కారణం చేత , ఒక్కొక్కసారి కష్టపడి పండించిన పంట అంతా వర్షానికి తడిసి పోవడం మరియు పంటను తక్కువ ధరకు అమ్ముకోవడం వంటి కారణాల చేత రైతులు ఆర్థిక నష్టాలు పొందడమే కాకుండా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఇటువంటి దుర్భర పరిస్థితి నుండి దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని కావున సంబంధిత ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి రైతులు కష్టపడి పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు అవసరమైన శీతల గిడ్డంగుల నిర్మాణం పనులు గోకవరంలో ప్రారంభించాలని సంబంధిత అధికారులు గోకవరం మండల డిప్యూటీ తహసీల్దార్ దివ్యభారతి కు, మండల అభివృద్ధి అధికారిిిికె. కిషోర్ కుమార్ కు, మండల వ్యవసాయ అధికారి కు,గోకవరం గ్రామపంచాయతీ కార్యదర్శి టి. శ్రీనివాస రావు కు కాపు యువజన సంఘం సభ్యులు వినతిపత్రాన్ని అందజేశారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తోట సాయిబాబు కార్యదర్శి దోసపాటి సుబ్బారావు కోశాధికారి డాక్టర్ బాబు ఉప కోశాధికారి ఆచంట బాబురావు సంఘ సభ్యులు మైపాల పాండు మింది నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment