Followers

తాళ్ళపూడి గ్రామ దేవత  శ్రీమోదుగులమ్మ కు అభిషేకాలు



తాళ్ళపూడి గ్రామ దేవత  శ్రీమోదుగులమ్మ కు అభిషేకాలు

 

తాళ్లపూడి,  పెన్ పవర్: 

 

తాళ్లపూడి గ్రామం లో గత నాలుగు నెలల నుండి కరోనా మహమ్మారి బారిన పడి అనేక ఇబ్బందులు  ఎదుర్కొంటున్న  గ్రామ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మూల విరాట్కు 11రకాల  అబిషేకాలను అర్చక బృందంతో  నిర్వహించామని శివాలయం అర్చకులు జంధ్యాల అశ్వని కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు జరిగిన  ఈ అభిషేకాలకు అధిక సంఖ్య  లో ప్రజలు పాల్గొన్నారు. తాళ్లపూడి లో గోదావరి గట్టున ఉన్న  గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ మోదుగులమ్మ అమ్మవారి మూల విరాట్ కు పాలు, పెరుగు, నెయ్యి,తేనె,పంచదార, పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, విభూది, సుగంధ ద్రవ్యాలు, మరియు పండ్ల రసాలతో  అభిషేకాలు చేసి గ్రామాన్ని, గ్రామ ప్రజలను చల్లగా చూడాలని, ఎటువంటి రుగ్మతలు, దరిచేరకుండా రక్షించాలని, ఈ అభిషేకాలు నిర్వహించామని, ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు, గ్రామస్థులకు ధన్యవాదాలు తెలువుతున్నానని అశ్వని

కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో  గ్రామ మాజీ సర్పంచ్ నామన పరమేశ్వరరావు,  రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షలు సింహాద్రి జనార్దన్, సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ సిద్ధంశెట్టి బాలాజీ, జడ్డు శ్రీనివాసరావు

గణపతి యువజన సంఘం సభ్యులు, దేవరెడ్డి సత్యనారాయణ(డి.వి), సింగం శివప్రసాద్, గోలి వీరవేంకట సత్యనారాయణ (అన్నవరం), మరియు  అధిక సంఖ్య లో గ్రామస్థులు  పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...