జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు శ్యామ్ ఎంపిక
ఆత్రేయపురం,పెన్ పవర్
మండలం అంకంపాలెం లో ప్రధాన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్న చింతా శ్యామ్ కుమార్ జాతీయ స్థాయిలో విద్యా సంబంధ అంశాలపై నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్. సి. ఆర్. టి) జూలై 21నుండి సెప్టెంబర్ 15 వరకు నిషిత (నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ హోలిస్టిక్ అడ్వాన్స్ మెంట్) శిక్షణకు ఎంపిక అయినట్లు మండల విద్యాశాఖాధికారి వర ప్రసాద్ తెలిపారు. పూర్తిగా ఆన్ లైన్ పద్ధతిలో జరిగే ఈ శిక్షణకు హజరు కావలసినదగా ఎంపిక ఉత్తర్వులు ఎస్ సి ఆర్ టి నుండి శ్యామ్ అందుకున్నాడని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్యాము ను మండల మండల డెవలప్ మెంట్ అధికారి నాతి బుజ్జి, మండల విద్యాశాఖ అధికారి వరప్రసాద్, సర్వ శిక్ష అభియాన్ ఎకడమిక్ మోనటరింగ్ ఆథికారి బి. సుబ్రహ్మణ్యం, సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి విజయ భాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తదితరులు శ్యాం ను అభినందించారు.
No comments:
Post a Comment