ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్న అధికారులు
పెన్ పవర్,కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి
కందుకూరు లో కరోనా కేసులు పెరుగుతున్న నేపద్యంలో ట్రాఫిక్ నియంత్రణ లో భాగంగా రైతు బజార్ వద్ద కార్లు,ఆటోలు అటువైపు వెళ్లకుండా పార్కింగ్ దగ్గరే ఉండేటట్లు కందుకూరు రూరల్ ఎస్సై అంకమ్మ ,మునిసిఫల్ కమీషన్ మనోహర్ రైతు బజార్ కి ఇరువైపులా తోపుడు బండ్లను ఉంచి వాహనాలను నియంత్రించారు.రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా పార్కింగ్ దగ్గర నిలిచిఉన్న నీటిని,చెత్తని శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్సై అంకమ్మ మాట్లాడుతూ కందుకూరులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు గుమ్మిగూడకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈరోజు ఒక ప్రయత్నం చేశామని ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గణేశం గంగిరెడ్డి, చక్కా వెంకట కేశవరావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment