రెండవ రోజు కొనసాగుతున్న లాక్ డౌన్
పాయకరావుపేట,పెన్ పవర్
గ్రామ పెద్దలు,వివిద పార్టీ నాయకుల నేతృత్వంలో ప్రజలు,వ్యాపారస్తులు స్వచ్చందంగా పాల్గొని నిర్వహిస్తున్న లాక్ డౌన్ రెండవరోజుకు చేరుకుంది.ఈ సందర్బంగా స్తానిక గ్రంధాలయ ఆవరణంలో సమావేశమైన పెద్దలు వైరస్ బారిన ప్రజలు పడకుండా పలు కీలకమైన కఠినమైన ఆంక్షలపై చర్చించారు.వ్యాపారస్తుల విజ్ఞప్తి మేరకు మార్కెట్లను,దుకాణాలను ఉదయం ఏడు గంటల నుండి మద్యాహ్నం పదకొండు గంటలవరకు సమయం సడలిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.నిబందనలను ఉల్లంఘిస్తే కోవిడ్ చట్టం అమలు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రందాలయ మాజీ చైర్మెను ,బిజేపి నాయకులు తోట నగేష్ ,మార్కెటుయార్డు వైస్ చైర్మెను గుటూరి శ్రీను,వైసీపి టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా,టిడిపి నాయకులు పెదిరెడ్డి శ్రీను,మజ్జూరి నారాయణరావు,కాంగ్రేసు నాయకులు జగతా శ్రీనివాస్ ,ఇంజరపు సూరిబాబు,ఐఎన్ .మూర్తి,మాత రాజీవ్ ,పెంకే శ్రీను,బిఎస్ నారాయణ,జగతా ప్రసాద్ తదితరులు మరియు ఎసై .విభీషణరావు పాల్గొన్నారు
No comments:
Post a Comment